Silver: కేజీ వెండి రూ.లక్ష 50వేలు అవ్వటం పక్కా.. మోతీలాల్ ఓస్వాల్ రిపోర్ట్..

Silver: కేజీ వెండి రూ.లక్ష 50వేలు అవ్వటం పక్కా.. మోతీలాల్ ఓస్వాల్ రిపోర్ట్..

Silver Rates: దేశీయ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ వెండి రేట్లపై తన అంచనాలను పంచుకుంది. రానున్న సంవత్సర కాలంలో కేజీ వెండి రేటు రూ.లక్ష 50వేలకు చేరుకుంటుందని చెప్పింది. ఇప్పటికే స్పాట్ మార్కెట్లో వెండి గడచిన ఏడాది కాలంలో 37 శాతం రాబడిని అందించిందని బ్రోకరేజ్ వెల్లడించింది. ప్రధానంగా డాలర్ రేటు పడిపోవటం, పారిశ్రామిక వినియోగం, పెట్టుబడిదారులతో పాటు సెంట్రల్ బ్యాంకుల నుంచి డిమాండ్ ర్యాలీకి కొన్ని కారణాలుగా మోతీలాల్ చెప్పింది. 

రానున్న కాలంలో ఔన్సు వెండి రేటు 45 డాలర్లకు చేరుకుంటుందని ఆ తర్వాత అది పుంజుకుని 50 డాలర్ల మార్కును అధిగమిస్తుందని అంచనాలు ఉన్నాయి. మోతీలాల్ తాజా రిపోర్ట్స్ ప్రకారం మెల్లగా వెండి రేట్లు 6 నెలల్లో కేజీకి రూ.లక్ష 35వేలకు చేరుకుంటాయని ఆ తర్వాత 12 నెలల కాలంలో రూ.లక్ష 50వేలకు చేరే అవకాశం ఉందని వెల్లడించింది. ఈవీలు, సోలార్ ఎనర్జీ, 5జీ, సిల్వర్ ఈటీఎఫ్స్, సెంట్రల్ బ్యాంక్స్ డిమాండ్ రేట్లను పెంచుతున్నాయని బ్రోకరేజ్ గుర్తించింది. 2025లో మెుత్తం వెండి వినియోగంలో 60 శాతం పారిశ్రామిక అవసరాలకే ఉపయోగించబడిందని బ్రోకరేజ్ చెప్పింది. 

రష్యా, సౌదీ వండి దేశాలు కూడా వెండిపై భారీగానే పెట్టుబడులు పెడుతున్నాయి. ఇదే క్రమంలో ఇండియా 2025 మెుదటి ఆరు నెలల కాలంలో ఏకంగా 3వేల టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. ఇదే క్రమంలో డిజిటల్ ఈటీఎఫ్ పెట్టుబడులకు కూడా భారీగా డిమాండ్ పెరగటం గమనార్హం. యూఎస్ బాండ్ ఈల్డ్స్ పడిపోవటం కూడా వెండి డిమాండ్ పెంచుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

కొనుగోలని అనుకుంటున్న ఇన్వెస్టర్లు.. లక్ష 15వేల నుంచి లక్ష 18వేల రేటు మధ్య వెండి కొనాలనుకునే వారు అక్యూమిలేట్ చేసుకోవచ్చని బ్రోకరేజ్ కంపెనీ ప్రకటించింది. గడచిన 5 ఏళ్లుగా డిమాండ్ కంటే తక్కువగానే వెండి సరఫరా ఉండటంతో రేట్లు అమాంతం పెరిగిపోతున్నట్లు వెల్లడైంది.