
హైదరాబాద్, వెలుగు : మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఎంఓఏఎంసీ) సోమవారం 'మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్'ను ప్రకటించింది. ఇది ఓపెన్-ఎండ్ ఈక్విటీ స్కీమ్. న్యూ ఫండ్ ఆఫర్ మంగళవారం మొదలవుతుంది. ఇదే నెల 19న ముగుస్తుంది.
ఎంఓఏఎంసీ ఏడు సంవత్సరాల తర్వాత యాక్టివ్ ఫండ్‌ను ప్రారంభిస్తోందని ఫండ్ హౌస్ తెలిపింది. స్మాల్-క్యాప్ స్టాక్‌లకు కనీసం 65శాతం ఎక్స్‌పోజర్‌తో బ్యాలెన్స్‌డ్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించాలని ఫండ్ లక్ష్యంగా పెట్టుకుంది. లిక్విడిటీ ప్రయోజనాల కోసం లార్జ్ క్యాప్ స్టాక్‌లకు కొంతమొత్తాన్ని కేటాయిస్తుంది.