Stocks To Buy: మోతీలాల్ ఓస్వాల్ సూచించిన 8 స్టాక్స్.. కొంటే 24 శాతం వరకు లాభం!

Stocks To Buy: మోతీలాల్ ఓస్వాల్ సూచించిన 8 స్టాక్స్.. కొంటే 24 శాతం వరకు లాభం!

Motilal Oswal: చాలా రోజుల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లలో స్వల్ప గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఏ షేర్లను కొనుగోలు చేయాలి లేదా తమ స్వల్పకాలిక పెట్టుబడి వ్యూహాలకు ఎలాంటి స్టాక్స్ సరిపోతాయనే దానిపై రీసెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దేశీయ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ 8 షేర్లను కొనుగోలుకు వీలుగా ఉన్నాయని పేర్కొంది. వీటిలో ఐటీ నుంచి స్టీల్ వరకు అనేక రంగాల షేర్లను కవర్ చేసింది.

1. ముందుగా బ్రోకరేజ్ సంస్థ ఐటీ రంగానికి చెందిన హెక్సావేర్ టెక్నాలజీస్ కంపెనీ షేర్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కంపెనీ షేర్లు ప్రస్తుతం ఉన్న స్టాయి నుంచి 19 శాతం పెరిగి రూ.950కి చేరుకోవచ్చని తన అంచనాలను పంచుకుంది. కంపెనీ నిరంతరం అభివృద్ధి చెందటం, కొత్త పార్టనర్షిప్స్ వంటివి వృద్ధిపై నమ్మకాన్ని పెంచుతున్నట్లు పేర్కొంది.2027 నాటి కంపెనీ వ్యాపార మార్జిన్లు 15.3 శాతానికి పెరుగుతాయని పేర్కొంది. 

ALSO READ | ఈ వారం జీడీపీ డేటా, గ్లోబల్ అంశాలపై మార్కెట్‌‌ ఫోకస్‌‌

2. ఇక బ్రోకరేజ్ రాడార్లో ఉన్న మరో స్టాక్ జేఎస్డబ్ల్యూ స్టీల్. ఈ స్టాక్ ధర రానున్న కాలంలో 19 శాతం పెరుగి రూ.1190కి చేరుకోవచ్చని పేర్కొంది. దీంతో కంపెనీ షేర్లకు కొనుగోలు రేటింగ్ అందించిన మోతీలాల్ కంపెనీ ఆరోగ్యకరమైన రాబడులను నమోదు చేయటం కొనసాగిస్తుందని అభిప్రాయపడింది.

3. ఇక పెయింటింగ్ వ్యాపారంలో ఉన్న గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లకు కొనుగోలు రేటింగ్ ఇస్తూ 19 శాతం పెరిగి షేర్లు రూ.3వేల 170 స్థాయికి చేరుకుంటాయని మోతీలాల్ ఓస్వాల్ బలంగా చెప్పింది. వ్యాపారంలో మార్జిన్ల ఒత్తిడి కారణంగా కంపెనీ ఈపీఎస్ అంచనాలను బ్రోకరేజ్ తగ్గించింది.

4. ఆటో రంగానికి చెందిన అషోక్ లేలాండ్ స్టాక్ షేర్లు రానున్న సమీప కాలంలో 15 శాతం పెరిగి రూ.275 స్థాయికి చేరుకుంటాయని బ్రోకరేజ్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ వాహనాలకు పెరుగుతున్న డిమాంక్ కంపెనీ ఆదాయాలను పెంచుతుందని బ్రోకరేజ్ వెల్లడించింది.

5. ఇక షిప్పింగ్ రంగంలో ఉన్న కంటైనర్ కార్పొరేషన్ కంపెనీ షేర్లు సమీప భవిష్యత్తులో 18 శాతం వరకు పెరిగి రూ.850 మార్కుకు చేరుకుంటాయని బ్రోకరేజ్ అంచనాల్లో పేర్కొంది. దేశీయంగా తగ్గుతున్న డిమాండ్ కారణంగా లాభాలు తగ్గే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది.

6. ఇక మెట్రో బ్రాండ్స్ స్టాక్ 16 శాతం వరకు పెరిగి రూ.14వందలకు చేరుకుంటుందని బ్రోకరేజ్ వెల్లడించింది. కంపెనీ గతంలోని ఇబ్బందుల నుంచి మెల్లగా బయటపడుతోందని, అయితే దీర్ఘకాలంలో కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు మంచి రాబడిని ఇవ్వగలవని నమ్ముతున్నట్లు పేర్కొంది. ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు కలిసొస్తున్నాయని పేర్కొంది. 

7. మోతీలాల్ ఓస్వాల్ తాజాగా MTAR టెక్నాలజీస్ కంపెనీ షేర్లకు బై రేటింగ్ అందించింది. సమీప కాలంలో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి 17 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.వెయ్యి 950 స్థాయికి చేరుకుంటాయని తన అంచనాల్లో పేర్కొంది. అలాగే కంపెనీ ఆదాయాలు 30 శాతం పెరుగుదలతో, లాభాల పెరుగుదల చూస్తుందని బ్రోకరేజ్ వెల్లడించింది.

8. ఇక చివరిగా బ్రోకరేజ్ సంస్థ డ్రీమ్ ఫోక్స్ కంపెనీ షేర్లకు కొనుగోలు రేటింగ్ అందిస్తూ.. స్వల్పకాలంలో 24 శాతం వృద్ధితో రూ.350 స్థాయికి చేరుకుంటాయని పేర్కొంది. పెరుగుతున్న ఎయిర్ పోర్ట్ లాంజ్ మార్కెట్ నుంచి ఇది లాభపడనుందని మోతీలాల్ పేర్కొంది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.