ప్రయాణంలో వాంతులు వికారంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..

ప్రయాణంలో వాంతులు వికారంతో ఇబ్బంది పడుతున్నారా..  ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..

 కొందరికి బస్సు పడదు, మరికొందరికి కారు పడదు, ఇంకొందరికి విమానం పడదు. ఎక్కితే చాలు వికారం మొదలై వాంతులు అయిపోతాయి. అందుకే ప్రయాణం అంటే చాలు భయపడిపోయే పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది. వీటిని మోషన్ సిక్‌నెస్ అని పిలుస్తారు. అలాగే కైనెటోసిస్ అని కూడా అంటారు. ఈ సమస్య వల్ల ప్రయాణిస్తున్నప్పుడు వారికి పొట్టలో తిప్పినట్టు అయి, వాంతులు అవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి కారణం ప్రయాణం సమయంలో కళ్ళు, లోపలి చెవి, మెదడు మధ్య సమన్వయం తగ్గడమే.  ప్రయాణ సమయంలో వాంతులు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

లోపలి చెవిలో ఎండోలింపు అనే ద్రవం మనం ప్రయాణంలో కదులుతున్న విషయాన్ని గ్రహిస్తుంది. ఆ విషయాన్ని మెదడుకు చేరవేస్తుంది. ఒకవేళ మనం ప్రయాణిస్తున్నప్పుడు కదలడం అనేది ఆ ద్రవం నుంచి కాకుండా కళ్ళ నుంచి మెదడు సమాచారం అందుకుంటే కాస్త తికమకపడుతుంది. ఈ తికమక పడిన విషయాన్నే వాంతి, వికారం వంటి లక్షణాల ద్వారా బయటపెడుతుంది. అలాగే ఆందోళన, ఒత్తిడి వంటివి కూడా కలుగుతాయి. కాబట్టి ప్రయాణాల్లో వాంతి, వికారాలు కలగకుండా తగ్గించే కొన్ని చిన్నచిన్న చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే ప్రయాణాల్లో వాంతులు అయ్యే అవకాశం తగ్గవచ్చు.'

ALSO READ :బొజ్జ గణపయ్యకు కొత్త ముస్తాబు

చిట్కాలు ..

  • ప్రయాణాలు చేసేటప్పుడు వికారం.. వాంతులు రాకుండా ఉండాలంటే ప్రయాణానికి ముందు ఏమీ తినకుండా ఉండాలి.   నిమ్మకాయను చేత్తో పట్టుకొని దాని వాసన పీలుస్తూ ఉంటే వాంతి వచ్చే అవకాశం తగ్గుతుంది.
  •  పుల్ల పుల్లని రుచి ఉండే చాక్లెట్లను నోట్లో పెట్టుకుని చప్పరించడం మంచిది. అలాగే అల్లం రుచి కూడా వాంతులు, వికారాన్ని తగ్గిస్తుంది
  •  ఎక్కువగా నీరు తాగడం వల్ల కూడా వాంతి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణానికి ముందు మీరు ఆహారం తీసుకోకూడదు.
  • విమానాల్లో, రైళ్లలో, బస్సుల్లో కిటికీ పక్క సీటును ఎంచుకోవాలి.  లాంగ్ టూర్ వెళ్లే వారు కంఫర్టబుల్ పోజిషన్ లో కూర్చోవడం ద్వారా ట్రావెల్ సిక్ నెస్ ను తగ్గించుకోవచ్చు.  కంఫర్టుబుల్ సీట్లో ఇరుకుగా లేని సీట్లో కూర్చోవాలి.
  •  ట్రావెల్ సిక్ నెస్ ఉన్నవాళ్లు ప్రయాణం సమయంలో. ముఖ్యంగా మీ దృష్టిని మరల్చుకోవాలి.  పుస్తకాలు చదవడం.. మొబైల్ గైమ్స్ వాడటం... లాంటివి చేస్తే సిక్ నెస్ ఎక్కువఅవుతుంది. ఒకే దానిపై ఎక్కువ సేపుకాన్సన్ ట్రేట్ చేస్తే తలనొప్పి వస్తుంది.  ఇష్టమైన సంగీతం వినడం, సినిమా చూడడం వంటివి చేసుకోవాలి.
  • ట్రావెల్ సిక్నెస్ ఉన్నవాళ్లు బస్సులో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.  పూర్తిగా ఏసీపై ఆధారపడకుండా కొద్దిగా కిటికీలు తెరిచి ఉంచుకోవాలి.  బయటి గాలి కాస్తయినా లోపలికి వచ్చేలా చూసుకోవాలి.
  •  ధూమపానం అలవాటు ఉంటే ప్రయాణంలో కానీ, ప్రయాణానికి ముందుగానే సిగరెట్లు కాల్చకూడదు.
  • వీలైతే కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకోవాలి.
  • ప్రయాణ సమయంలో చూయింగ్ గమ్ నమలడం ద్వారా కడుపులో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. 
  • వైద్యుల సలహా తీసుకొని ప్రయాణానికి గంట ముందు వాంతి రాకుండా అడ్డుకునే మాత్రలు వేసుకోవడం మంచిది.
  • ప్రపంచంలో ఉన్న జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇలా మోషన్ సిక్‌నెస్ సమస్య ఉన్నట్టు అంచనా. 
  • పిల్లల్లో, మహిళల్లో అధికంగా ఇది కనిపిస్తుంది. ఎగుడుదిగుడు రోడ్లపై ప్రయాణం చేస్తే వాంతులయ్యే అవకాశం పెరుగుతుంది.