
మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో వంటి చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘మోటివ్ ఫర్ మర్డర్’. సంబీత్ ఆచార్య, జో శర్మ జంటగా నటిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ టైటిల్ టీజర్‌ను దిల్ రాజు రిలీజ్ చేసి.. టీజర్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉందని, సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ ‘రాహుల్ అడబాల, జో శర్మ ఈ కథను రాయడంలో సహకరించారు. దర్శకుడిగా నేను కొత్త అవతారం ఎత్తాను. నెక్స్ట్ హాలీవుడ్‌లోనూ సినిమాను నిర్మించబోతున్నా’ అని చెప్పారు. ఈ చిత్రానికి మోహన్ గారు స్ర్కీన్‌ప్లే బాగా రాసుకున్నారని చెప్పింది జో శర్మ. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.