హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పరిపాలన నిజాం పాలనను మించిపోయిందన్నారు మాజీమంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు. ప్రజా సంక్షేమాన్ని కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. 12 వందల మంది ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందన్నారు. కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందన్న మోత్కుపల్లి..వరద బాధితులను కేసీఆర్ పరామర్శించకపోవడం దారుణమన్నారు.
