Gandhi Talks Teaser: మాటలు లేని కరెన్సీ కథ ‘గాంధీ టాక్స్’.. కట్టిపడేస్తున్న విజయ్ సేతుపతి మూవీ టీజర్!

Gandhi Talks Teaser: మాటలు లేని కరెన్సీ కథ ‘గాంధీ టాక్స్’.. కట్టిపడేస్తున్న విజయ్ సేతుపతి మూవీ టీజర్!

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితిరావు హైదరి, సిద్ధార్థ్ జాధవ్ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించిన మూకీ సినిమా ‘గాంధీ టాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’.  కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వం వహించడంతో పాటు ఉమేష్ కుమార్ బన్సల్, రాజేష్ కేజ్రీవాల్, మీరా చోప్రాతో కలిసి నిర్మించారు.

ఇప్పటికే ఓ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసిన మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. తాజాగా మరో టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. గాంధీ బొమ్మ ఉన్న ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరెన్సీ నోటు మనిషి జీవితాన్ని ఎలా శాసిస్తోంది అనే కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ సినిమా తీసినట్టు అర్థమవుతోంది.

డైలాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా రా ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజువల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నటీనటుల పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ సినిమా ద్వారా ఏదో బలమైన సందేశాన్ని ఇవ్వబోతున్నారనే ఆసక్తిని టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అలాగే రెహమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించిన సంగీతం టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రో లెవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లింది. గాంధీజీ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్థంతి సంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్భంగా జనవరి 30న జీ స్టూడియోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.