
బెల్లంపల్లి రూరల్, వెలుగు: కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ బంక్‌లో డీజిల్లో నీరు రావడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. టేకులపల్లి క్రాస్ రోడ్డు వద్ద గల హనుమాన్ ఫిల్లింగ్ స్టేషన్ (ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్) లో పలువురు ట్రాక్టర్లలో డీజిల్ పోయించుకున్నారు. కొంత సమయం తర్వాత ట్రాక్టర్ల సైలెన్సర్ల నుంచి ఎక్కవ పొగ వచ్చి బండ్లు ఆగిపోయాయి. దీంతో క్యానుల్లో తీసుకువెళ్లిన డీజిల్‌ను బంకుకు తీసుకొచ్చి బంక్ యజమాని ముందు పరిశీలించగా డీజిల్ లో నీరు ఉన్నట్లు తేలింది.
దీంతో వాహనదారులు యజమానిని నిలదీశారు. వాహనాలు రిపేర్ చేసి ఇవ్వాలని బంక్‌లో ఆందోళనకు దిగారు. దీంతో యజమాని మెకానిక్‌లను రప్పించి ట్రాక్టర్లను రిపేర్ చేయిస్తానని, పూర్తి ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇవ్వడంతో ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు ఆందోళన విరమించారు.