భారత మార్కెట్ లోకి మోటరోలా ఎడ్జ్ ఫోన్

భారత మార్కెట్ లోకి మోటరోలా ఎడ్జ్ ఫోన్


ప్రముఖ సెల్ కంపెనీల్లో ఒకటైన లెనోవోకు చెందిన మోటరోలా ఎడ్జ్ సిరీస్ లో భాగంగా కొత్త ఫోన్లను భారత మార్కెట్ లోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 08వ తేదీన వర్చువల్ గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. డైమెన్సిటీ 1050 చిప్ సెట్ తో తయారు చేసిన ఈ ఫోన్ ను పరిచయం చేయనుంది. అంతేగాకుండా మోటా ఎక్స్ 30 ప్రో, మోటా ఎస్ 3 ప్రో మోడల్స్ లను కూడా విడుదల చేసే అవకాశాలున్నాయి. మోటరోలా ఎడ్జ్ 2022 ఫోన్ ఇప్పటికే అమెరికాలో విడుదలైంది.

ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే...
త్వరలోనే భారత్ లో కూడా విడుదలు చేస్తారని ప్రచారం జరిగింది. 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్ ఓఎల్ ఈడీ డిస్ ప్లే ఉంది. వెనుక భాగంలో మూడు కెమెరాలున్నాయి. అందులో 50 మెగాపిక్సల్ తో ప్రధాన కెమెరా ఉండగా, సెల్పీల కోసం 32 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. 144 గిగా హెర్జ్ రీ ఫ్రెష్ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ టర్బో పవర్ చార్జర్ లు ఉన్నాయి. అమెరికాలో దీని ధర రూ. 40 వేలు గా ఉంది. భారత్ లో కూడా ఇంచుమించు అదే ధర ఉంటుందని భావిస్తున్నారు.