ఎవరెస్ట్​ శిఖరం ఎత్తు 8,844.43 మీటర్లు

ఎవరెస్ట్​ శిఖరం ఎత్తు 8,844.43 మీటర్లు

బీజింగ్​: నేపాల్‌‌, చైనా బార్డర్‌‌లోని ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌‌ ఎత్తును కొలిచేందుకు మే 1న బయల్దేరిన చైనా టీమ్‌‌ బుధవారం శిఖరంపైకి చేరుకుంది. కొత్త లెక్కల ప్రకారం ఎవరెస్ట్‌‌ ఎత్తు 8844.43 మీటర్లు అని తేల్చింది. ఇంతకుముందు నేపాల్‌‌ ఇచ్చిన కొలతల కన్నా ఇది నాలుగు మీటర్లు తక్కువ. రెండు దేశాల బార్డర్‌‌లో 2015లో వచ్చిన భూకంపం వల్ల శిఖరం ఎత్తు నాలుగు మీటర్లు తగ్గి ఉంటుందని భావిస్తున్నారు. కరోనా వైరస్‌‌ వ్యాప్తి  వల్ల రెండు దేశాలూ ఎవరెస్ట్‌‌ ఎక్కడాన్ని మార్చిలోనే నిలిపివేశాయి. అయితే ఈ నెల ఒకటో తేదీ  నుంచి చైనా తమ దేశానికి చెందని వాళ్లను కొన్ని  కండిషన్లతో శిఖరం ఎక్కడానికి పర్మిషన్​ ఇస్తోంది.

చైనా, నేపాల్‌‌ మధ్య బార్డర్​ గొడవ చాలా ఏళ్లు నడిచింది. 1961లో ఎవరెస్ట్‌‌ మధ్య నుంచి బార్డర్‌‌ను నిర్ణయించారు. అయితే రెండు దేశాలు టూరిస్టుల్ని ఎవరెస్ట్‌‌ మీదకు తమ భూభాగం నుంచి పంపుతున్నాయి. చైనా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ టూరిస్టులను ఆకట్టుకుంటోంది. ఇక, తమ దేశానికే  చెందిన టెక్‌‌ సంస్థ హువావేతో కలిసి ఎవరెస్ట్ శిఖరంపై రెండు 5జీ స్టేషన్లను నిర్మించడానికి చైనా ప్లాన్‌‌ చేస్తోంది. ఈ స్టేషన్లు శిఖరాన్ని మొత్తం కవర్ చేస్తాయని అంటున్నా టెక్నికల్‌‌గా ఇంకా టెస్ట్‌‌ చేయాల్సి ఉంది.  వీటి నిర్మాణం పూర్తయితే ఇవే ప్రపంచంలో ఎత్తైన 5జీ స్టేషన్లు కానున్నాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి

బతికుండగానే.. తల్లికి నిప్పంటించాడు