పిల్లలు రొటీన్ బ్రెడ్ జామ్ తిని బోర్ ఫీల్ అవుతున్నారా ? వారికి కొత్తగా, వెరైటీగా ఏదైనా తినిపించాలనుకుంటే ఈ బ్రెడ్ ఉప్మా మంచి ఛాయిస్. తియ్యగా, పుల్లగా, కారంగా ఉండే ఈ ఉప్మాను లంచ్ బాక్స్‌లో పెడితే బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే! అటు తీపి, ఇటు కారం కలగలిసి పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ రుచికరమైన బ్రేక్-ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా...
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ :8 ముక్కలు,
నూనె: 2 టేబుల్ స్పూన్
కారం: ఒక టేబుల్ స్పూన్
ధనియాల పొడి : అర టీ స్పూన్
జీలకర్ర: అర టీ స్పూన్
ఇంగువ: చిటికెడ
మినప్పప్పు: ఒక టీ స్పూన్
ఉల్లిపాయ తరుగు: అర కప్పు
టొమాటో కెచప్ : ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు: ఒక రెమ్మ,
పసుపు: అర టీ స్పూన్
షుగర్: ఒక టీ స్పూన్,
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
ముందుగా బ్రెడ్ ముక్కల అంచులు తీసేయాలి. తర్వాత స్టవ్ మీదపాన్ పెట్టి నూనె వేసి మినప్పప్పు, ఉల్లిపాయ తరుగు, ధనియాల పొడి, కారం, ఇంగువ వేగించాలి. ఇందులోనే టొమాటో కెచప్, పసుపు, ఉప్పు.. వేసి బాగా కలపాలి. చివరిగా బ్రెడ్ ముక్కలతో పాటు షుగర్ వేసి ఐదు నిమిషాలు వేగించాలి.. బ్రేడ్ ఉప్మా రెడీ..
