Technology: ట్విట్టర్లో లేనివి.. ‘థ్రెడ్స్ యాప్’లో ఉన్నవి..6 అదనపు ఫీచర్స్..

Technology: ట్విట్టర్లో లేనివి.. ‘థ్రెడ్స్ యాప్’లో ఉన్నవి..6 అదనపు ఫీచర్స్..

ఇన్స్టాగ్రామ్ కొత్త యాప్ థ్రెడ్స్ ఇప్పుడు ట్విట్టర్ కు సవాల్ విసురుతోంది. జూలై 6న ప్రారంభించిన థ్రెడ్స్ అనతి కాలంలోనే 100 మిలియన్ల యూజర్ల సంపాదించుకుంది. అయితే ట్విట్టర్, థ్రెడ్స్ రెండు యాప్లను గమనించినట్లయితే ట్విట్టర్ కంటే థ్రెడ్స్ చాలా సులభంగా, తేలికైన ఫీచర్లను కలిగి ఉంటుంది. దీనికి ఎటువంటి యాడ్స్ లేనప్పటికీ హ్యాష్ ట్యాగ్, పోస్ట్ లను శోధించే విషయంలో థ్రెడ్స్ చాలా ముందుంది.  ఈ ఫ్లాట్ ఫారమ్ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ ట్విట్టర్ లోలేని కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లను కలిగి ఉంది. అవేంటో చూద్దాం..

ఫొటోలు, వీడియో అప్లోడ్ 
తన పేరెంట్ యాప్ ఇన్ స్టాగ్రామ్ మాదిరిగానే థ్రెడ్స్ లో కూడా ఫొటోలు, వీడియోల అప్ లోడింగ్ పరిమితి ఎక్కువగానే ఉంది.  ఒక పోస్ట్ కు 10 ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ చేయొచ్చు. అంతేకాదు సింగిల్ పోస్ట్ లో  ఫొటోలను సమాంతరంగా కంటికి నచ్చే విధంగా డిస్ ప్లే చేస్తుంది. దీనికి భిన్నంగా ట్విట్టర్ లో కేవలం 4 ఫొటోలు, అదీ 2x2 డిస్ ప్లే చేస్తోంది.

ప్రొఫైల్‌ పరిమితం చేయొచ్చు
అనవసర పోస్ట్ లు వద్దనుకుంటే థ్రెడ్స్ వాటిని వెంటనే బ్లాక్ చేయొచ్చు. ఎవరైనా మీకు అనవసర పోస్టులు పంపిస్తున్నప్పుడు వారికి తెలియకుండా వాటిని నిరోధించవచ్చు.  ఇన్ స్టాగ్రామ్ లో ఉన్నట్లే ‘restricting.’ అనే ఆప్షన్ ను మ్యూట్ చేసినట్లయితే థ్రెడ్స్లో  కూడా అనవసర పోస్టులను నిరోధించవచ్చు. ఫ్రొఫైల్ బ్లాక్ చేసిన తర్వాత అతని నుంచి లైక్స్ , రీ పోస్ట్  వంటి ఎలాంటి మేసేజ్లు రావని థ్రెడ్స్ ప్రతినిధి చెబుతున్నారు. ట్విట్టర్ లో ఇలాంటి ఆప్షన్ లేదు. అయితే  మాన్యువల్ మ్యూట్ చేయొచ్చు. అయితో దీనివల్ల టైమ్ లైన్ లో అవి కనిపించవు. 

తాత్కాలిక  నోటిఫికేషన్ల విరామం 
మీరు ఇప్పుడే థ్రెడ్స్ యాప్ తెరిచినప్పటికీ  నోటిఫికేషన్లు కొన్ని సమయాల్లో చికాకు కలిగించొచ్చు.  దీనిని పరిష్కరించేందుకు థ్రెడ్స్ లో ఆప్షన్ ఉంది. నిర్ణీత వ్యవధిలో నోటిఫికేషన్లను మ్యూట్ చేసుకునే అవకాశం ఉంది. అనవసర నోటిఫికేషన్లతో మరి ఎక్కువ ఇబ్బంది ఉన్నప్పుడు వీటిని 8 గంటల పాటు మ్యూట్ చేసుకోవచ్చు. ట్విట్టర్ లో ఇలాంటి ఆప్షన్ లేదు. అయితే మీరు మీ ఫోన్ సెట్టింగ్ల నుంచి  శాశ్వతంగా నోటిఫికేషన్లను ఆఫ్ చేసుకోవచ్చు. తిరిగి నోటిఫికేషన్లు పొందాలనుకుంటే మాన్యువల్ గా ఆన్ చేసుకోవాలి. 

డైరెక్టుగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీకి పోస్టులు 
ఇన్ స్టాగ్రామ్ లో మాదిరిగానే ఇంకో ప్రయోజనం కూడా థ్రెడ్స్ యాప్ లో ఉంది. మీ  థ్రెడ్స్ ను డైరెక్టుగా ఇన్ స్టాగ్రామ్ కథనాలుగా పోస్ట్ చేయొచ్చు. ఇది మీమ్స్ ను పంచుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది. ట్విట్టర్ లో అయితే స్క్రీన్ షాట్ తీసి, మీ స్టోరీలో పోస్ట్ చేసిన పాత పద్దతిని ఉపయోగించాల్సి ఉంటుంది. 
సైనప్ చాలా సులభం
 థ్రెడ్స్ యాప్ లో  కేవలం బటన్ నొక్కడం సైన్ అప్ చేయొచ్చు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పేరు, బయోడేటా, అనుచరులు, ఇతర డేటా మొత్తం ఒక్క క్లిక్ తో థ్రెడ్స్ లోకి వస్తుంది. ఖాతా తెరవడం అనేది ఏ యాప్ లోనూ ఇంత సులభంగా ఉండదు. అదే ట్విట్టర్ లో అయితే గూగుల్, యాపిల్ ద్వారా మాత్రమే సైన్ అప్ 

రాబోయే రోజుల్లో థ్రెడ్స్ యాప్ లో మరిన్ని మెరుగైన అడ్వాన్స్ డ్ ఫీచర్లు అందుబాటులోకి తెస్తామని ఇన్ స్టాగ్రామ్ సీఈవో ఆడమ్ మొస్సేరి ఇటీవల ఓ థ్రెడ్స్ పోస్ట్ లో తెలిపారు. ట్విట్టర్ కంటే మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఇంకా ఏవైతే లేనటువంటి ఫీచర్లను త్వరలో అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. మీరు అనుసరించే వ్యక్తి పోస్ట్ లను చూసే టైమ్ లైన్, పోస్ట్ ఎడిట్ బటన్, పోస్ట్ లసెర్చింగ్ ఆప్షన్ వంటి ఫీచర్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ముఖ్యంగా పోస్ట్ ఎడిట్ బటన్ పై దృష్టి సారించినట్లు తెలిపారు.  ఎడిట్ పోస్ట్ ఆప్షన్ ను కేవలం సబ్ స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేసింది.