గూగుల్ నుంచి కూడా ఇకపై సినిమా టికెట్లు

గూగుల్ నుంచి కూడా ఇకపై సినిమా టికెట్లు

ఇక నుంచి సినిమా టికెట్లకోసం ప్రత్యేకంగా వెబ్‌ సైట్లోకి వెళ్లే పని లేకుండా గూగుల్ సెర్చ్ నుండే సినిమా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని గూగుల్ కల్పిస్తోంది.కొన్ని మూవీ బుకింగ్ ప్లాట్‌ ఫామ్స్‌ తో భాగస్వామ్యంకు దుర్చుకుని గూగుల్ ఈ సేవలను అందిస్తోంది. గూగుల్ సెర్చ్‌‌‌‌ తో పాటు ఆండ్రాయిడ్,ఐవోఎస్, గూగుల్ అసిస్టెంట్‌ లలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ వెబ్ వెర్షన్‌‌‌లో మాత్రం కొన్ని ఫంక్షనాలిటీస్ అందుబాటులో లేవు. సినిమా టికెట్లను త్వరగా బుక్ చేసుకోవాలంటే గూగుల్‌ లో మూవీస్ అని సెర్చ్ చేస్తే,దగ్గర్లో ని మల్టీప్లెక్స్‌ లు, థీయెటర్లలో నడుస్తున్నసినిమాల గ్రాఫ్‌ను చూడవచ్చు. దీన్లో కావల్సిన సినిమా, టైంను ఎంచుకుంటే నేరుగా పేటీఎమ్,బుక్‌‌‌‌మైషో, ఐనాక్స్ బుకింగ్ పేజ్‌ కు తీసుకెళ్తుంది. దీంతో టికెట్ కొనుగోలు పూర్తవుతుంది. ఆసక్తికర విషయం ఏంటంటే, పీవీఆర్‌ సినిమాస్‌‌‌‌లో నడుస్తున్న సినిమాల బుకింగ్ పేజ్‌ కు ఈ ఫీచర్ పనిచేయడం లేదు.

ఇది గూగుల్‌ కు సులువైన పని….

మూవీ బుకింగ్ ఫీచర్ గూగుల్‌ కు చాలా సులువైనది. ఇప్పటికే సి నిమాలు, షోలకు సంబంధించిన పూర్తి సమాచారం గూగుల్ వద్ద ఉంది. దీంతో పాటు బుక్‌‌‌‌మైషో, పేటీఎమ్ వెబ్‌ సైట్లకంటే కూడా ఎక్కువ ఫిల్టర్స్ గూగుల్‌ లో ఉన్నాయి .సాధారణ మూవీ టైమింగ్స్ , భాష, తేదీ వంటి వాటితో పాటుగా సి నిమా జానర్, స్క్రీన్ టై ప్, క్రిటిక్స్ స్కోర్ , రేటింగ్స్ , సి నిమా చైన్స్ వంటి ఎన్నో ఫిల్టర్లు గూగుల్‌ సొంతం. అయితే ఈ ఫీచర్లలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి . మూవీస్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ కోసం మనకు నచ్చిన ప్లా ట్‌ ఫామ్‌‌‌‌ను ఎంచుకోలేం.పేటీఎమ్, బుక్‌‌‌‌మైషో, ఐనాక్స్ హాల్స్‌ను మాత్రమేగూగుల్ ఆప్షన్లుగా ఇస్తోంది. ఇందులోనుండే మనం బుకింగ్ చేసుకునే సదుపాయం ఉంది.

వృద్ధి చెందుతున్నఆన్‌ లైన్ టికెటింగ్ బిజినెస్….

రీడ్‌ సీర్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఆన్‌‌‌‌లైన్ టికెటింగ్ బిజినెస్ వేగంగా వృద్ధి చెందుతోంది. టాప్ ప్లే యర్లు బుక్‌‌‌‌మైషో, పేటీఎమ్‌‌‌‌ల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. ఇవి రెండు గూగుల్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఆన్‌‌‌‌లైన్ టికెటింగ్ పరిశ్రమ 330 మిలియన్ డాలర్లు కాగా, దీన్లో మూవీ టికెట్ కొనుగోళ్లదే పైచేయి. 20 శాతం వృద్ధితో 2020 నాటికి 580 మిలియన్ డాలర్లను చేరుకుంటుందని రీడ్‌ సీర్ రిపోర్ట్‌‌‌‌ వెల్లడించింది.

ఘనాలో గూగుల్ ఏఐ ల్యాబ్….

గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) రీసర్చ్ లాబోరేటరీని ఆఫ్రికాలోనే మొదటిసారిగా ఘనాలో ప్రారంభించింది. ఆఫ్రికా ఖండానికి సంబంధించిన అన్ని సవాళ్లను ఇక్కడినుండే పరిష్కరించనుంది. ఘనా రాజధాని ఆక్రాలో ఏర్పా టుచేసిన ఈ ల్యాబ్ , ఆర్థిక, రాజకీయ, వాతావరణ అంశాలపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు యుఎస్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. ఆఫ్రికాలోని ఎన్నో సవాళ్లకు ఏఐ పరిష్కారం చూపుతుందని, ఇతర ప్రదేశాలకంటే కూడా ఇక్కడ ఏఐ అవసరం ఎక్కువగా ఉంటుం దని ఆక్రా ఏఐ గూగుల్ హెడ్ ముస్తఫా సిస్సే తెలిపారు. టోక్యో, జురిచ్, న్యూయార్క్, పారిస్‌‌‌‌లలో ఇప్పటికే ఇలాంటి రీసర్చ్ సెంటర్లు ప్రారంభమయ్యాయి . ఈ సరికొత్త ల్యా బ్‌ లో ఏఐ వినియోగం ద్ వారా ఆరోగ్యం, విద్యా, వ్యవసాయ రంగాల్లో సమస్యలకు పరిష్కారాలను అందించేందుకు తోడ్పడుతుందని సిస్సే అన్నా రు. దీంతో పంటతెగుళ్లను గుర్తించడం సులువుగా మారుతుందని చెప్పారు. ప్రముఖ ఇంజనీర్లు, ఏఐ రీసర్చర్లు, ప్రాం తీయ ఆర్గనైజేషన్లతో పాటు పాలసీమేకర్లతో కలిసి పనిచేస్తారని తెలిపారు. ఏఐ డెవలప్‌‌‌‌మెంట్‌ ను ప్రాంతాలవారీగా మరింత విస్తరించేందుకు యూనివర్సిటీలతో పాటు ఘనా, నైజీరియా, కెన్యా , సౌత్ ఆఫ్రికాల్లోని స్టార్టప్‌‌‌‌లతో కలిసి గూగుల్ పనిచేస్తోంది. కొత్తతరం ఏఐ డెవలపర్లను ప్రోత్సహిస్తోంది.