
సీఎం కేసీఆర్ వైఖరిపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎదుగుదలను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కమలం పార్టీ ఎదుగుదలను నిలువరించే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం మరో హత్య చేసిందని అర్వింద్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నందునే సాయి గణేష్పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టారని... మంత్రి పువ్వాడ అజయ్ అండతోనే రౌడీషీట్ ఓపెన్ చేయించారని మండిపడ్డారు. ఆ కారణంగానే మనస్తాపానికి గురై సాయి గణేశ్ మూడ్రోజుల క్రితం ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. సాయి గణేశ్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించిన అర్వింద్... అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మనస్తాపానికి గురై మూడు రోజుల క్రితం 14 వ తేదీన ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నం, ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి.
— Arvind Dharmapuri (@Arvindharmapuri) April 16, 2022
వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
(2/2)