
కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ తాజా హెల్త్ బులిటెన్‌ను కర్నూలు విశ్వభారతి వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమెకు చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఆమెను 2023 మే 26 శుక్రవారం రోజున డిశ్చార్జి చేస్తామని వెల్లడించారు.
గుండె సంబంధిత చికిత్స కోసం వేరే ఆస్పత్రికి రిఫర్ చేస్తాం అని వైద్యులు ప్రకటించారు. మెరుగైన వైద్యం కోసం లక్ష్మమ్మను హైదరాబాద్‌కు తరలించే అవకాశం కనిపిస్తోంది. కాగా లోబీపీ గుండెపోటుకు గురైన లక్ష్మమ్మను మే19వ తేదీన కర్నూలులోని విశ్వభారతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు.
మరోవైపు అవినాష్‌రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు అవినాష్‌రెడ్డి.