బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ ఆదర్శనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండ్లు కాలిపోయిన బాధితులకు అండగా ఉంటామని ఎంపీ బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భరోసా ఇచ్చారు. బాధితులు  తిరిగి తమ జీవనాన్ని కొనసాగించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానన్నారు. శుక్రవారం అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఎంపీ పరామర్శించారు.  ఈ సందర్భంగా ప్రమాదంలో తాము సర్వస్వం కోల్పోయామని పలువురు బాధితులు ఎంపీ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. 

కష్టపడి దాచుకున్న బంగారంతోపాటు నగదు, ఉపాధి కల్పిస్తున్న పరికరాలు, వాహనాలు సైతం దగ్ధమయ్యాయని వాపోయారు. స్పందించిన ఆయన అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.