కేటీఆర్ పేరు జోసెఫ్ గోబెల్స్.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే: ఎంపీ చామల

కేటీఆర్ పేరు జోసెఫ్ గోబెల్స్..  ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే: ఎంపీ చామల
  • ప్రతిపక్షం ఎలా ఉండాలో పక్క రాష్ట్రాల్లో చూసి నేర్చుకోండి
  • భువనగిరి ఎంపి చామల కిరణ్​ కుమార్ రెడ్డి

హైదరాబాద్: కేటీఆర్ పేరు జోసెఫ్ గోబెల్స్ అని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షం ఎలా ఉండాలో పక్క రాష్ట్రాల్లో చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఒక జెడ్పీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించిన రేవంత్ రెడ్డి సీఎం అయితే తప్పేంటన్నారు.

 సామాన్యులెవరైనా ముఖ్యమంత్రులు కావచ్చని చెప్పారు. వాళ్లు ఐదేండ్లలో దఫదఫాలుగా రుణమాఫీ చేయవచ్చు కానీ.. తాము 25 రో జుల్లో రుణమాఫీ చేస్తే తప్పేంటన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే.. మరో వైపు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నామని అన్నారు.