
- ఎంపీ చామల కిరణ్ కుమార్, ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, వెలుగు: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని పీహెచ్‌సీలో ఎంపీల్ స్టీల్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య పరికరాలు, ఫర్నిచర్, వాటర్ ప్లాంట్‌ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వంతో పాటు పరిశ్రమలు, సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ చైర్మన్ నర్రా వినోద మోహన్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, ఎమ్మార్వో కృష్ణ, ఎంపీడీవో జయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ ఉబ్బు నరసింహ, చిట్యాల మెడికల్ ఆఫీసర్ ఈసం వెంకటేశం, కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, పోకల దేవదాస్, జడల చిన్నమల్లయ, ఎంపీల్ స్టీల్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
నకిరేకల్, (వెలుగు) : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బాలికల పాఠశాల క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత - శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవ్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్లు, మండల విద్యాధికారి పాల్గొన్నారు.