పాలన తెలియని అవివేకి కేసీఆర్

పాలన తెలియని అవివేకి కేసీఆర్

సీఎం కేసీఆర్ అసమర్థుడు..అవినీతి పరుడు అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రాష్ట్రంలో వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిపై సమీక్షలు పెట్టాల్సింది పోయి..విపక్షాలను తిట్టేందుకు ప్రెస్ మీట్లు పెడతారా అని ప్రశ్నించారు. గ్రామాల్లో వర్షాలతో ప్రాజెక్టులు, చెరువుల కట్టలు తెగిపోతున్నాయన్నారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కు అధికారులకు సమన్వయం లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. సొల్లు కబుర్లు..మొరుగుడు బంద్ చేసి సమస్యలపై రివ్యూ చేయాలని సూచించారు.  ఒక్క నిజామాబాద్ నియోజకవర్గంలోనే 230 ఇండ్లు డ్యామేజీ అయ్యాయని..కొన్ని ఇండ్లు కూలిపోయాయన్నారు. వరదల వల్ల 9 మంది చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని..రూ. 300 కోట్లకు పైగా ఆస్తినష్టం సంభవించిందని ప్రభుత్వం పేర్కొన్నట్లు వెల్లడించారు. 

కేసీఆర్ అబద్దాల కోరు..
ఏపీ విభజన చట్టం ప్రకారం 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలకు ప్రకటించి రోడ్ల అభివృద్దికి 2015 నుంచి ప్రతీ ఏడాది 50 కోట్లు కేంద్రం ఇస్తుందని ఎంపీ అరవింద్ తెలిపారు. కానీ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు కలరించి ఇచ్చి శంకుస్థాపనలు చేశారన్నారు.  నీతి ఆయోగ్ ఇచ్చిన నిధుల వినియోగంపై వెరిఫికేషన్ కు వస్తామని అధికారులు ప్రకటించడంతో ఆగమేఘాల మీద శిలాఫలకాలు తొలగించి కేంద్రం ఇచ్చినట్లు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ పచ్చి అబద్దాల కోరు అని ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మినిస్ట్రేషన్ తెలియని అవివేకి కేసీఆర్ అని మండిపడ్డారు. ప్రెస్మీట్ పెట్టి అన్ని అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో డ్రగ్ కల్చర్, మత్తు పదార్థాల సరఫరాలో తెలంగాణ దూసుకుపోతుందన్నారు. కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తున్నా...నిధులు మంజూరు చేస్తున్నా..కేంద్రంపై నిందలు వేస్తూ...తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎంపీ అరవింద్ మండిపడ్డారు.