
- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ
పాలమూరు, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కల్వకుంట్ల కుటుంబానికి సంబంధం ఉందని, దాన్ని బయట పెట్టడంలో కాంగ్రెస్ విఫలమైందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని బీజేపీ జిల్లా ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని స్వయంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే ఒప్పుకుందని..
అయితే అందులో కేసీఆర్ కు సంబంధం లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం వల్లే ఇక్కడ యూరియా కొరత ఏర్పడిందని మండిపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పద్మజా రెడ్డి, బాలరాజ్, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు