కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులకు అందాలి : ఎంపీ డీకే అరుణ 

కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులకు అందాలి : ఎంపీ డీకే అరుణ 
  •  మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిశ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఎంపీ డీకే అరుణ 

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీ, దిశ  చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్  డీకే అరుణ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో జిల్లా అభివృద్ది, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం ఎంపీ అధ్యక్షతన  నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకాలు పారదర్శకంగా అమలయ్యేలా చూడాలని, నిరుపేదలకు, సన్న, చిన్న కారు రైతులకు ప్రయోజనం కలిగేలా పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేయడంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా పాటించాలని, ఎటువంటి రాజకీయ జోక్యం, ఒత్తిళ్లకు గురికావద్దని అధికారులకు సూచించారు.   

వివిధ శాఖలపై సమీక్ష

జిల్లాలో వరి తర్వాత ఎక్కువగా పత్తి సాగు చేస్తారని, ప్రత్యామ్నాయ పంటల కింద వేరుశెనగను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలు, సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, మెదడు వాపు నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెల పెంపకం దారులకు  రూ.20 లక్షల మేర బ్యాంకర్లు రుణసాయం అందించాలని సూచించారు.

జింకల పార్క్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్ట్ రూపొందించాలని ఫారెస్ట్ ఆఫీసర్లకు సూచించారు. ఇండ్లపై రూఫ్ టాప్ సోలార్ అమర్చాలని లక్ష్యంతో తీసుకొచ్చిన పీఎం సూర్య ఘర్ ముప్త్ బిజిలీ యోజన గురించి ప్రచారం చేయాలన్నారు. ఈ స్కీం కింద కేంద్రం నుంచి 60 శాతం సాయం చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో కలెక్టర్ విజయేందిర బోయి, అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు, డీఏవో వెంకటేశ్‌‌‌‌‌‌‌‌, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీవో నర్సింహులు, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో కె.కృష్ణ, జిల్లా సహకార అధికారి శంకరాచారి, డీడబ్ల్యూవో జరీనా బేగం, ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్యనారాయణ, గనుల శాఖ ఏడీ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.