V6 News

మెగాజాబ్ మేళాలో 1500 మందికి ఉద్యోగాలివ్వడం గొప్ప విషయం: ఎంపీ వంశీకృష్ణ

మెగాజాబ్ మేళాలో  1500 మందికి ఉద్యోగాలివ్వడం గొప్ప విషయం: ఎంపీ వంశీకృష్ణ

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. బెల్లంపల్లి పట్టణం ఏఎంసీ మైదానంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన  మెగా జాబ్ మేళాలో ఎంపీ  వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ పలువురు అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణ.. బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన జాబ్ మేళాలో 3000 మంది నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు. వివిధ కంపెనీలు దాదాపు  1500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం గొప్ప విషయం అన్నారు.  సింగరేణి యజమాన్యం సహకరించి జాబ్ మేళాను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహిస్తే అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.  ప్రభుత్వపరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. దుబాయ్ లో జరిగిన  సమావేశంలో  దేశంలోని ఆర్థిక పరిస్థితులు, నిరుద్యోగ సమస్యను వివరించానన్నారు.  నైపుణ్యం గల యువతి యువకులు స్కిల్ ఉన్నవాళ్లు  తెలంగాణలో చాలా మంది ఉన్నారని   చెప్పానన్నారు.

స్వయం కృషితోనే యువకులు అభివృద్ధి చెందుతారని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. వ్యక్తి గత నమ్మకం పెంచుకొని ఉద్యోగసాధనకు ముందుకు వెళ్ళాలన్నారు. బెల్లంపల్లిలో సింగరేణి ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారం తో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో మూడు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.