హై స్కూల్లో బెంచీలు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

హై స్కూల్లో బెంచీలు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

జగిత్యాల జిల్లా  గొల్లపల్లి మండలం చిల్వకోడూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో  బెంచీలు పంపిణీ చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ క్రిష్ణ. స్కూల్లో బెంచీలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి తీసుకురావడంతో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50 బెంచీలను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణ.. గతంలో కూడా ఈ స్కూల్ కి 50 బెంచీలు  పంపిణీ చేశామన్నారు ఎంపీ. మంచిగా చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. 

త్రాగు నీరు, టాయిలెట్స్,ప్రహరీ గోడ మౌలిక వసతులు కావాలని అడిగారని... ఎంపీ లాడ్స్ నుంచి తెచ్చి నిధుల స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఎంపీ వంశీకృష్ణ.. పెద్దపల్లి పార్లమెంట్ లో ఏ స్కూల్లో  ఏ సమస్య వచ్చినా తన ఎంపీ లాడ్స్ నిధులతో సహకారం అందిస్తానని చెప్పారు.  విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్త శుద్ధి లేదన్నారు.  బీజేపీ కుల మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుందని ఆరోపోంచారు. 

ALSO READ : స్థానిక ఎన్నికల్లో రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్..

బీసీలకు 42 % రిజర్వేషన్ల ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎంపీ వంశకృష్ణ. తర్వాత పక్కనే ఉన్న అంగన్ వాడీ సెంటర్ ను పరిశీలించారు. పిల్లలకి పౌష్టికాహారం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.