కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం ఒర్రెగడ్డ బస్తీకి చెందిన మిరియాల రాజ్‌కుమార్ వైద్య ఖర్చుల కోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రూ.20వేల ఆర్థికసాయం అందించారు.
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజ్కుమార్తలకు తీవ్రగాయమైంది. స్థానిక కాంగ్రెస్ లీడర్లు ఎంపీ దృష్టికి తీసుకవెళ్లడంతో స్పందించిన ఆయన అత్యవసర చికిత్స కోసం రూ.20వేలు అందించారు. ఈ మొత్తాన్ని కాంగ్రెస్ లీడర్లు బుధవారం బాధిత కుటుంబానికి అందజేశారు.
