సుల్తానాబాద్: చైల్డ్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు పరార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సుల్తానాబాద్: చైల్డ్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు పరార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలోని చైల్డ్ హోమ్ నుంచి బుధవారం తెల్లవారుజామున ఇద్దరు బాలికలు గోడ దూకి పారిపోయారు. ఎస్సై చంద్రకుమార్ వివరాల ప్రకారం.. చైల్డ్ హోమ్‌‌‌‌‌‌‌‌లో అందరూ నిద్రిస్తుండగా తెల్లవారుజామున 9వ తరగతి చదువుతున్న బాలిక (16),4వ తరగతి చదువుతున్న మరో చిన్నారి (8) కాంపౌండ్ దూకి బయటపడ్డారు. గోడ ఎత్తుగా ఉండటంతో కుర్చీల సాయంతో గోడ దూకారు. భారీ వర్షం పడుతున్నా వారు దాదాపు రెండు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లినట్టు సీసీ కెమెరాల పుటేజీల్లో వెల్లడైంది. 

పెద్దపల్లి రూట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న చెరువు సమీపం వరకు రాజీవ్ రహదారి వెంట నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి తిరిగి బస్టాండ్ వరకు వచ్చారు. అక్కడి నుంచి ఏదో ఒక బస్సు ఎక్కి వెళ్లిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఉండడం ఇష్టం లేక పారిపోయినట్టు తెలుస్తోంది. బంధువులు ఇండ్లలో, ఇతర ప్రదేశాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చైల్డ్ హోమ్ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. బాలికల ఆచూకీ తెలిస్తే 87126 56511, 87126 56510 నంబర్లకు కాల్ చేయాలని కోరారు. కాగా, చైల్డ్ హోమ్‌‌‌‌‌‌‌‌ను పెద్దపల్లి డీసీపీ రామ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఏసీపీ జి.కృష్ణ, సీఐ రంజిత్ రావు సందర్శించారు.