నవంబర్ 7 నుంచి వందేమాతరం 150 ఏండ్ల ఉత్సవాలు : ఎంపీ కె. లక్ష్మణ్

నవంబర్ 7 నుంచి వందేమాతరం 150 ఏండ్ల ఉత్సవాలు : ఎంపీ కె. లక్ష్మణ్
  • ఎంపీ కె. లక్ష్మణ్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ‘వందేమాతరం’ గీతాన్ని స్వరపరిచి 150 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సంయుక్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె. లక్ష్మణ్ తెలిపారు. ఈ నెల 7 నుంచి 25 వరకు ‘వందేమాతరం@150’  పేరుతో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడించారు. 

ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ నెల 7న దేశంలోని 150 ముఖ్యమైన ప్రాంతాల్లో, 150 మంది గాయకుల సమక్షంలో ఈ గీతాన్ని అలపిస్తారని చెప్పారు. వందేమాతరం గీతాన్ని బంకించంద్ర చటర్జీ 1875లో రచించారని లక్ష్మణ్ గుర్తు చేశారు. ఈ గీతం స్వాతంత్ర్య పోరాటంలో ఉద్యమ గీతంగా, యుద్ధ నినాదంగా నిలిచిందని ఆయన అన్నారు.