
శాయంపేట (ఆత్మకూర్), వెలుగు: దేశ ప్రగతి మహిళా అభ్యున్నతిపై ఆధారపడి ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం పెద్దాపూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించనున్న మహిళా కమ్యూనిటీ హాల్‌కు ఆదివారం వారు శంకుస్థాపన చేశారు.
అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఓర్వలేని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మహిళలే గుణపాఠం చెప్తారన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కమలాపురం రమేశ్, ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బీరం సునందాసుధాకర్ రెడ్డి, పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్, మాజీ స్పర్పంచ్పర్వతగిరి రాజు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, మండల అధికార ప్రతినిధి అబ్దుల్ కపూర్, పెద్దాపురం సొసైటీ వైస్ చైర్మన్ అంబటి రాజస్వామి తదితరులు పాల్గొన్నారు.
వైద్య శిబిరం ఏర్పాటు
పరకాల: హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేటలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు. వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.