
చేవెళ్ల, వెలుగు: విద్యార్థినులు కరాటే నేర్చుకోవాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మణి గార్డెన్స్‌లో ఆదివారం మొదటి దక్షిణ భారత కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... కరాటే వంటి యుద్ధకళలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక ధైర్యాన్ని పెంచుతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
స్థానిక యువత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. దక్షిణ భారత దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు కరాటేలో తమ ప్రతిభ కనబరిచారు. విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్. రత్నం
పాల్గొన్నారు.