
- దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి భేటీ
హైదరాబాద్‌సిటీ/వికారాబాద్, వెలుగు: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నెలకొన్న రైల్వే సమస్యలపై మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవతో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యంగా నావంద్గీ రైల్వే స్టేషన్లో హుబ్లీ ఎక్స్ప్రెస్ఆపడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్లమెంట్ పరిధిలో నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ ప్రగతిపై చర్చించారు.
వికారాబాద్, తాండూరు రహదారిలో కోర్టు దగ్గరలో ఉన్న రైల్వే ట్రాక్ పై నిర్మించే ఆర్వోబి, రామయ్య గూడ వద్ద రైల్వే ట్రాక్‌పై నిర్మించే ఆర్వోబీల కోసం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. శంకర్ పల్లి రైల్వే స్టేషన్ ను ఆధునికరించడానికి, శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ఆర్ యూబీ నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. సమావేశంలో డీజీఎంలు ఉదయనాథ్, మల్లాది శ్రీనివాస్, సీపీఆర్వో శ్రీధర్ ఉన్నారు.