కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌కు కేంద్రం నయా పైసా ఇవ్వలే

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌కు కేంద్రం నయా పైసా ఇవ్వలే
  • పార్లమెంట్‌‌‌‌లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌కు కేంద్రం నయా పైసా ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కానీ, బీజేపీకి చెందిన ఎంపీ శషికాంత్ ధూబే మాత్రం కాళేశ్వరానికి కేంద్రం రూ.86 వేల కోట్లు ఇచ్చిందని సభలో అబద్ధాలు చెప్ప డం దారుణమన్నారు. గురు వారం అవిశ్వాసంపై చర్చలో భాగంగా బీఆర్ఎస్ తరఫున ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లా డారు. ‘‘యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్‌‌‌‌లోనే బీజేపీ అబద్ధాలు చెబుతుందనుకున్నాం కానీ పార్లమెంట్‌‌‌‌లో కూడా పెద్దపెద్ద అబద్ధాలు చెబుతుందని ఇప్పుడే తెలిసింది. బీజేపీ ఎంపీ చెప్పినట్లుగా రూ.86 వేల కోట్లను ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇచ్చారో చెప్పాలి”అని ఆయన డిమాండ్‌‌‌‌ చేశారు. కాగా, ఉదయం నిషికాంత్ ధూబేపై బీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్‌‌‌‌‌‌‌‌కు ప్రివిలైజ్ మోషన్ కింద ఫిర్యాదు చేశారు. 

కేంద్ర మంత్రిని అడగండి 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌‌‌‌సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్‌‌‌‌‌‌‌‌ఈసీ) ద్వారా రూ.86 వేల కోట్లు తెలంగాణకు అందాయని జార్ఖండ్‌‌‌‌కు చెందిన బీజేపీ ఎంపీ నిషికాంత్ ధూబే అన్నారు. ఈ విషయంలో తాను అబద్ధాలు చెప్పడం లేదని, సభలోనే జలశక్తి శాఖ మంత్రి కూడా ఉన్నారని, అవసరమైతే ఆయన ద్వారా వాస్తవాలు తెలుసుకోవచ్చన్నారు. బీజేపీ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదన్నారు.