
న్యూఢిల్లీ, వెలుగు: తెలం గాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంపై అసెంబ్లీ, పార్లమెంటులో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఎంపీ మల్లు రవి అన్నారు. ఎన్ని తీర్పులు వచ్చినా బీసీలకు ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి దగ్గర మూడు నెలలకు పైగా పెండింగ్లో ఉంటే అవి పాస్ అయినట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జీవో 9పై స్టే ఇచ్చారని పేర్కొన్నారు