
- ఎంపీ మల్లు రవి
ఆమనగల్లు, వెలుగు : బీసీ బాలుర హాస్టల్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలో బీసీ బాలుర హాస్టల్భవన నిర్మాణ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యాలయాలు, వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. భవన నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు మంగ్లీ రాములు, నాయకులు ఉన్నారు.
కోల్‌కతా తరహాలో అలంపూర్ అభివృద్ధి
వనపర్తి, వెలుగు : అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని కోల్‌కతాలోని కాళీదేవీ ఆలయంలా అభివృద్ధి చేస్తామని నాగర్‌కర్నూలు ఎంపీ మల్లురవి అన్నారు. మంగళవారం వనపర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 16న శ్రీశైలానికి ప్రధాని మోదీ రానున్నారని, ఆయనను కలిసి అలంపూర్ ఆలయాన్ని యూనిసెఫ్ గుర్తింపు కోసం కృషి చేయాలని కోరతామన్నారు. కోల్‌కతాలో కాళికాదేవి శక్తిపీఠాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో.. అదేమాదిరిగా జోగులాంబ ఆలయాన్ని కూడా చేయాలని అడుగుతామని చెప్పారు. ఒకవేళ ప్రధానిని కలిసేందుకు అవకాశం ఇవ్వకుంటే ఢిల్లీ వెళ్లి కలుస్తామని తెలిపారు.