ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ రాయడంపై స్పందించారు ఎంపీ మల్లు రవి. హరీష్ రావు లెటర్ రాసింది మూసీ బాధితుల కోసం కాదన్నారు. రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ తట్టుకోలేక రాహుల్ గాంధీకి లేఖ రాశారన్నాడు.
మూసీని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయన్నారు మల్లు రవి. బలవంతంగా పేద ప్రాజల పొట్టగొట్టాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. మూసీపై నిర్మాణ పనులు ఇంకా స్టార్ట్ కాలేదన్నారు. డబ్బులు కూడా డ్రా చేయలేదన్నారు. కానీ అవినీతి జరిగిందని కేటీఆర్ ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు మల్లు రవి.