గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు : ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్

గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు : ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్
  • అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

ఖానాపూర్, వెలుగు: గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నాయని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్, పెంబి మండలాల్లో జరిగిన వివిధ అభివృద్ధి పనుల్లో  ఆదివారం వారు పాల్గొన్నారు. ఖానాపూర్ మండలం రాజురాలో ఎన్ హెచ్ఎం పథకం కింద రూ.20 లక్షలతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. 

దాస్ నాయక్ తండా, బాదనకుర్తి, పెంబి మండలంలోని మందపల్లి గ్రామాల్లో  రూ.12 లక్షల ఖర్చుతో చేపడుతున్న అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో వారు పాల్గొని మాట్లాడారు. ఇందులో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ భూషణ్, అబ్దుల్ మజీద్, మున్సిపల్ మాజీ చైర్మన్ చిన్నం సత్యం, ఆత్మ చైర్మన్ తోట సత్యం, నాయకులు రవీందర్, సంజీవ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. 

అర్ధరాత్రి ఆస్పత్రిలో ఎమ్మెల్యే తనిఖీలు 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నా రు. శనివారం అర్ధరాత్రి ఖానాపూర్ పట్టణంలోని 50 పడకల హాస్పిటల్​ను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఐపీ వార్డులతో పాటు రికార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఇక్కడ అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. డ్యూటీ డాక్టర్, నర్సింగ్ ఆఫీసర్లతో మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.