మీసాలు పెంచాడని ఉద్యోగం నుంచి తీసేశారు

మీసాలు పెంచాడని ఉద్యోగం నుంచి తీసేశారు

మధ్యప్రదేశ్లో ఓ కానిస్టేబుల్కు వింత అనుభవం ఎదురైంది. మీసాలు పెంచాడన్న కారణంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. రాకేశ్ రానా అనే వ్యక్తి మధ్యప్రదేశ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్కు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి మీసాలు పెంచుకోవడం అంటే ఇష్టం. ఇప్పుడు అదే ఆయన ఉద్యోగానికి ఎసరు పెట్టింది. రాకేశ్ మీసాలు పొడవుగా ఉండటంతో ఉన్నతాధికారులు ట్రిమ్ చేసుకోవాలని సూచించారు. ఎన్నిసార్లు చెప్పినా అతను మాట వినకపోవడంతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. యూనిఫాం ఉద్యోగులు పాటించాల్సిన నిబంధనలు బేఖాతరు చేస్తున్నాడంటూ రాకేశ్ రానాను ఉద్యోగం నుంచి తొలగించారు. సస్పెండ్ చేసినప్పటికీ తాను మాత్రం మీసాలు ట్రిమ్ చేసుకునే ప్రసక్తేలేదని రాకేశ్ అంటున్నాడు. ఇది తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని అంటున్నాడు. గతంలో ఎవరూ తనను మీసాలు ట్రిమ్ చేసుకొమ్మని చెప్పలేదని.. ఈ విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తేలేదని చెబుతున్నాడు.

For more news..

ధనిక రాష్ట్రంలో 9వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాల్లేవు

పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు కరోనా