పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు కరోనా

పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు కరోనా

చండీఘడ్ : పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కరుణ రాజు కరోనా బారిన పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజే పంజాబ్ సీఈఓకు వైరస్ సోకింది. సోమవారం షెడ్యూల్ విడుదలైన వెంటనే కరుణ రాజు చండీఘడ్లో ప్రెస్ మీట్ పెట్టి విధి విధానాలు ప్రకటించారు. అనారోగ్యంగా ఉండటంతో ఈ రోజు ఉదయం కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని కరుణ రాజు ప్రకటించారు. ప్రెస్మీట్కు హాజరైన వారందరూ టెస్టులు చేయించుకోవాలని కోరారు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఈ నెల 21న నోటిఫికేషన్ జారీ కానుంది. 

For more news..

జనవరి 15 తర్వాత పరిస్థితులు మారొచ్చు

అన్నయ్య మృతిపై మహేశ్ ఎమోషనల్ పోస్ట్