అన్నయ్య మృతిపై మహేశ్ ఎమోషనల్ పోస్ట్

అన్నయ్య మృతిపై మహేశ్ ఎమోషనల్ పోస్ట్

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేశ్ బాబు అంత్యక్రియలు ఇవాళ(ఆదివారం) పూర్తయ్యాయి. కోవిడ్ కారణంగా మహేశ్ బాబు తన అన్నయ్యను చివరి చూపు కూడా నోచుకోలేకపోయారు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మహేశ్. అన్నయ్య ఆత్మకు శాంత చేకూరాలని కోరుతూ తన ట్విట్టర్లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు మహేశ్. తన అన్నయ్య రమేశ్ బాబే తన  స్ఫూర్తి,  బలం , ధైర్యం, సర్వస్వం అని అన్నారు. తన అన్నయ్య   లేకపోతే ఈ రోజు ఉన్న మనిషిలో తాను సగం కూడా  ఉండేవాడిని కాదన్నారు. తనకు మరో జన్మంటూ ఉంటే తానే అన్నయ్యగా ఉండాలని కోరారు. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అన్నయ్య అంటూ ఎమోషనల్ అయ్యారు మహేశ్.  కోవిడ్ కారణంగా తన అన్నయ్య అంత్యక్రియలకు కూడా మహేశ్ ఫ్యామిలీ దూరంగా ఉంది. రమేశ్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో శనివారం రాత్రి కన్నుమూశారు.