ప్రశ్నిస్తున్నందుకే.. మైక్ ఇవ్వటం లేదు : రాహుల్

ప్రశ్నిస్తున్నందుకే.. మైక్ ఇవ్వటం లేదు : రాహుల్

ప్రధాని నరేంద్ర మోడీ, ప్రముఖ వ్యాపారవేత్త అదానీ మధ్య ఉన్న సంబంధాలేంటని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రశ్నించారు. తాను ప్రశ్నలు మాత్రమే లేవనెత్తానని, సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు తప్పించుకుంటోందన్నారు. అదానీ విషయంలో కేంద్రం ఎందుకు మౌనం పాటిస్తోందన్నారు. షెల్ కంపెనీల్లో ఉన్న పెట్టుబడులు ఎవరివి..? అని ప్రశ్నించారు. అదానీ కంపెనీలపై అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రిపోర్టుపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా.. ఎందుకు విచారణ చేయడం లేదన్నారు. 

పార్లమెంటు ఎంపీగా సభలో మాట్లాడే హక్కు తనకు లేదా..? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సభలో మాట్లాడకుండా తనను ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అదానీ ఇష్యూను ప్రశ్నిస్తున్నందుకే సభలో తనకు మైక్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లోక్ సభ స్పీకర్ పక్షపాత ధోరణి వీడాలని కోరారు. తాను సభలోకి వస్తున్న ఒక్క నిమిషం ముందు సభను వాయిదా వేశారని రాహుల్ చెప్పారు.