- కేంద్రానికి రాజ్యసభ సభ్యుడు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం (ఎంఎంటీఎస్) సెంకడ్ ఫేజ్, హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కోరారు. శుక్రవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. రోజువారీ ప్రయాణంలో హైదరాబాద్ వాసులు ట్రాఫిక్‌లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పెండింగ్‌లో ఉన్న మెట్రో ఫేజ్–2 , ఏంఏంటీఏస్ ఫేజ్–2 ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులతో పాటు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఎయిర్‌పోర్ట్ రూట్, ఐటీ కారిడార్ వంటి దారుల్లో ట్రాఫిక్ భారీగా తగ్గుతుందని వివరించారు. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
