సీఎం ఫామ్‌హౌస్ లో ఉంటే రాష్ట్రంలో కరోనా తగ్గుతుందా: రేవంత్ రెడ్డి

సీఎం ఫామ్‌హౌస్ లో ఉంటే రాష్ట్రంలో కరోనా తగ్గుతుందా: రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్: కరోనాతో చాద‌ర్‌ఘ‌ట్‌లోని తుంబే హాస్పిటల్‌లో చేరిన ఫీవర్ ఆసుపత్రి డీఎంవో సుల్తానా కు… కేవ‌లం 24గంటలకు రూ.1.15లక్షల బిల్లు వేయ‌డంపై రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఒక వైద్యురాలికే ఇలాంటి ప‌రిస్థితి ఎదురైతే.. ఇక ప్రైవేట్ ఆస్ప‌త్రికి వెళ్లే మాములు జ‌నం పరిస్థితి ఏంటని ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి సెల్ఫీ వీడియోను రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఒక్క రోజుకు ఆస్పత్రి యాజమాన్యం రూ.లక్ష బిల్ చేసిందని, ప్రశ్నించిన సుల్తానాను ఆస్పత్రిలో బంధించారని ధ్వజమెత్తారు. సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదను చెప్పిందని, సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ లో‌ క్వారంటైన్లో ఉంటే తెలంగాణలో కరోనా తగ్గుతుందా? అని ‌ ప్రశ్నించారు.

బాధితురాలి సెల్ఫీ వీడియో సోష‌ల్ మీడియాతో పాటు.. మీడియాలో రావడం పై వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్పందించి తుంభే ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ బారిన పడ్డ వారందరినీ నిమ్స్ తరలించాలని అదికారులను సూచించారు.

మ‌రోవైపు.. ఆసుపత్రి వర్గాలు మీడియా సమావేశం నిర్వ‌హించి.. మా దెగ్గర బెడ్ సదుపాయం లేకున్నా ఆమె కోరిక మేరకు బెడ్ లేకున్నా డీలక్స్ రూమ్ ఇచ్చామన్నారు. రేట్ ఎక్కువ అయిన పర్వాలేదని, ఆమె చెబితేనే ఇచ్చామన్నారు. ఆ త‌ర్వాత బిల్ చెల్లించ‌లేక ఆస్ప‌త్రి సిబ్బంది ఆమెను నిర్బంధించారంటూ సెల్ఫీ వీడియో తీసి.. త‌న‌ను కాపాడ‌లంటూ తెలిసిన‌వారికి పంపారని చెప్పారు. ఆ త‌ర్వాత వారి సాయంతో చాద‌ర్‌ఘ‌ట్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారన్నారు.

Related news: బిల్లు కట్టలేదని కరోనా వారియర్‌‌ను నిర్బంధించిన ఆస్పత్రి సిబ్బంది