రేవల్లిలో వివాహిత మిస్సింగ్

రేవల్లిలో వివాహిత మిస్సింగ్

రేవల్లి, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామం వచ్చిన ఓ వివాహిత అదృశ్యమైంది. ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రేవల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ యాకూబ్ కు భార్య రజియా బేగం, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. యాకూబ్​మహబూబ్ నగర్ లో ఆటోడ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబంతో అక్కడే ఉంటున్నాడు. మొదటి విడత సర్పంచ్​ఎన్నికలకు ఈ నెల 9న స్వగ్రామం వచ్చారు. 

అదేరోజు దంపతులు గొడవ పడ్డారు. మరుసటి రోజు రజియా బేగం కనిపించలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆమె భర్త పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్​కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై పేర్కొన్నారు.