నాగోబా జాతరకు రావాలని కేంద్ర మంత్రికి ఆహ్వానం

నాగోబా జాతరకు రావాలని కేంద్ర మంత్రికి ఆహ్వానం

బోథ్​, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్​లో ఆదివాసీలు నిర్వహించే నాగోబా జాతరకు రావాలని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్​ ముండేను జిల్లా ఎంపీ సోయం బాపురావు, మెస్రం వంశీయులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుధవారం ఢిల్లీలో ఆయనను కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత దేశంలోనే అతిపెద్ద గిరిజన నాగోబా జాతరకు మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు.

జనవరిలో10 రోజులపాటు జాతర నిర్వహిస్తామని జనవరి 24న నిర్వహించే ప్రజాదర్భార్​కు రావాలని ఆయనను కోరారు. కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్ రావ్,  మెస్రం ఆనంద్ రావు , మెస్రం చిన్ను పటేల్, మెస్రం బాధిరావు, మెస్రం హన్మంతు, మెస్రం దాధి రావు, కొట్నక్ కోషరావు పాల్గొన్నారు.