ఎన్నికల కోసమే కేసీఆర్ పోడు భూముల డ్రామా : సోయం బాపురావు

ఎన్నికల కోసమే కేసీఆర్ పోడు భూముల డ్రామా : సోయం బాపురావు

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నందున  సీఎం కేసీఆర్ పోడు భూముల డ్రామా ఆడుతున్నారని బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. అమాయక ప్రజలను మోసం చేయడానికే కేసీఆర్ పోడు భూముల పట్టాలంటూ వాగ్దానాలు చేస్తున్నాడంటూ ఆయన విమర్శించారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్కారంలో బీజేపీ కార్నింగ్ మీటింగ్ లో బాపురావు  పాల్గొన్నారు.  అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ అంటూ ఇచ్చిన  హామీ ఏమైందని కేసీఆర్ ను ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం సహాయం చేయడం లేదని  కేసీఆర్ అనడం సిగ్గుచేటన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం  అధికారంలోకి రావడం ఖాయమని బాపురావు  ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని అధికారంలోకి తీసుకోచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషిచేయాలన్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి సూచించారు.