
సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించి బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలనే సుశాంత్ శవపరీక్ష ఆలస్యం చేస్తున్నారని ఆయన అన్నారు. ‘ శవ పరీక్ష ఆలస్యం చేస్తే సుశాంత్ కడుపులోని విషాలు గుర్తించకుండా కరిగిపోతాయని హంతకుల అభిప్రాయం. సుశాంత్ ని హత్య చేసిన వారి క్రూర మనస్తత్వం నెమ్మదిగా బయటపడుతుంది. శవపరీక్ష ఆలస్యమైనా కొద్దీ సుశాంత్ కడుపులో ఉన్న విషాలు జీర్ణ ద్రవాల వల్ల గుర్తింపబడకుండా పోతాయి’ అని స్వామి ట్వీట్ చేశారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
సుబ్రహ్మణ్య స్వామి సోమవారం కూడా సుశాంత్ మృతికి సంబంధించి ట్వీట్లు చేశారు. సునంద మృతదేహాన్ని ఎయిమ్స్ వైద్యులు పోస్ట్ మార్టం చేసిన తర్వాతే నిజమేంటో తెలిసింది. కానీ హీరోయిన్ శ్రీదేవి, సుశాంత్ కేసులలో అలా చేయలేదు. సుశాంత్ చనిపోయిన రోజు దుబాయ్ డ్రగ్ డీలర్ అయాష్ ఖాన్ సుశాంత్ ని ఎందుకు కలిశాడు అని స్వామి నిన్నటి తన ట్వీట్ లో ప్రశ్నించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మహత్య కాదు హత్య అని స్వామి ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు.
For More News..