
తిరుపతి కోర్టుకు హాజరయ్యారు ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. టిటిడి పై అసత్య ప్రచారం చేసిన ఓ పత్రికపై ఫిల్ దాఖలు చేసిన క్రమంలో కోర్టుకు హాజరయ్యారు. గతేడాది కాలంగా తిరుపతి కోర్టులో విచారణ కొనసాగుతోంది. విచారణ రేపటితో చివరి దశకు చేరుకోనుంది. కేసు సంబంధించి విచారణపై ఇవాళ కోర్టుకు హాజరైనట్లు చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి. కేసుకు సంబంధించిన వివరాలను రేపు వెల్లడిస్తాన్నారు.