ఖమ్మంలోని బుర్హాన్ పురంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

ఖమ్మంలోని బుర్హాన్ పురంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

ఖమ్మం టౌన్, వెలుగు : ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన 13 మంది బాధితుల కుటుంబ సభ్యులకు గురువారం ఖమ్మంలోని బుర్హాన్ పురంలో ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చెక్కులు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, బీఆర్ఎస్ నాయకులు ఉప్పల వెంకటరమణ, పగడాల నరేందర్, నేలకొండపల్లి మండలం రాజారాంపేట సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.