కోల్ బెల్ట్ : మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికి రవాణా సదుపాయాల కోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కీలక చర్యలు చేపట్టారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ కీలక చర్యలు చేపట్టారు. ఇందుకు అనుగుణంగా వైద్య కళాశాల కోసం ప్రత్యేకంగా రెండు బస్సులకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్కటి రూ. 40 లక్షల చొప్పున మొత్తం రూ.80 లక్షలు అవసరం కాగా.. ఆ మొత్తం తన ఎంపీ నిధుల నుంచి కేటాయించేందుకు ముం దుకొచ్చారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. పెద్దపల్లి ఎంపీ నిధలు నుంచి అట్టి నిధులు మంజూరు చేసి కాలేజీకి అసవరమైన రెండు బస్సులు కొనుగోలు చేయాలని లేఖలో కలెక్టరు విజ్ఞప్తి చేశారు.
ALSO READ : గ్లోబల్ సమ్మిట్ లో ఆకట్టుకున్న హ్యూమన్ డ్రోన్.. హైదరాబాదీలు తయారు చేసిందే
నవంబర్ 21న పెద్ద పల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల జిల్లా గుడిపేటలోని మెడికల్ కాలేజీని సందర్శించారు. ఆ సందర్భంగా అక్కడి వైద్య విద్యార్థులు, అధ్యాపకులు తమకు రవాణా సదుపాయాలు సరిగా లేవని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రెండు బస్సులు ఏర్పాటు చేస్తే తమ సమస్య పరి ష్కారం అవుతుందని, ఆ మేరకు నిధులు సమ కూర్చాలని కోరారు. వెంటనే స్పందించిన ఎంపీ వంశీకృష్ణ జిల్లా కలెక్టర్కు అధికారికంగా లేఖ రాసి అందజేశారు. ఈ రెండు బస్సులు మెడికల్ స్టూడెంట్స్, ఇంటర్న్స్, ఫ్యాకల్టీ ప్రతిరోజూ ఎదుర్కొనే రవాణా సమస్యలను పరిష్కరించడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. విద్యార్థుల క్లిని కల్ పోస్టింగ్స్, అకడమిక్ ఫీల్డ్ విజిట్స్, గ్రామీణ వైద్య శిబిరాలు, మెడికల్ అవుట్ రిచ్, అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో స్పందన వ్యవస్థ, విద్యార్థు లు, సిబ్బందికి రోజువారీ రవాణా, మెడికల్ కాలేజీ అభివృద్ధి, విద్యార్థుల శిక్షణా ప్రమాణాల పెంపు, గ్రామీణ ఆరోగ్య సేవల విస్తరణలో ఈ బస్సులు కీలకమని ఎంపీ పేర్కొన్నారు.

