పెద్దపల్లి, వెలుగు: ధర్మారం మండలంలోని బుచ్చయపల్లికి చెందిన ఆవుల సదయ్య గుడిసె గ్యాస్లీకై దగ్ధమైన విషయం తెలిసిందే. బాధిత కుటుంబానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పంపించిన రూ.20 వేల ఆర్థికసాయాన్ని కాంగ్రెస్ మండల సీనియర్ నాయకుడు కాడె సూర్యనారాయణ ఆదివారం బుచ్చయ్యపల్లిలోని సదయ్య ఇంటికి అందజేశారు. బాధిత కుటుంబసభ్యులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పొన్నవేని స్వామి, బొంగాని సత్యనారాయణ, నార లక్ష్మణ్, మెండె మహేందర్, కాల్వ పవన్, దుంపేటి సదానందం, గంప శ్రీధర్, పూసల సదానందం, ఆవుల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
