ధర్మిపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ధర్మిపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి: దేశప్రజలు  ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా లోక్ సభ ఎన్నికల్లో తీర్పునిచ్చారన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ.  మోదీ ప్రభుత్వ చార్ సౌ పార్ నినాదాన్ని తిప్పికొట్టారని తెలిపారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనర్సింహా స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ వంశీకృష్ణ. 

ఆతర్వాత ధర్మపురి బస్టాండ్ లో వనమహో త్స వంలో భాగంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి మొక్కలు నాటారు.  ధర్మపురి లక్ష్మీ నర్సింహా స్వామి ఆశీస్సులతోనే వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలిచారన్నాను అడ్లూరి లక్ష్మణ్. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.