
హీరో రవితేజ, దర్శకుడు హరీష్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు... సంపద కాపాడేవాడు కూడా సైనికుడే..’ అంటూ రవితేజ పోషిస్తున్న బచ్చన్ పాత్రను పరిచయం చేశారు. ఇక జిక్కీ పాత్రలో నటిస్తున్న హీరోయిన్ భాగ్యశ్రీతో రవితేజ రొమాంటిక్ ట్రాక్, అలాగే సత్య కామెడీ సీన్స్ ఆకట్టుకున్నాయి.
నా గడప తొక్కాలంటే నా బలం వల్ల కాదు.. భయం వల్ల సచ్చిపోవాలి’అనే బిగ్ షాట్‌గా జగపతిబాబు.. అతని ఆస్తులపై రైడ్ చేసే పవర్ఫుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా రవితేజ కనిపించారు. మిక్కీ జె మేయర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంప్రెస్ చేసింది. కామెడీ, రొమాన్స్, డ్రామా, యాక్షన్ లాంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసిన సినిమా ఇదని ట్రైలర్లో చూపించారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.